MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿ 2023-24 విద్యా సంవత్సరంలో 6 నుండి 10 తరగతులు చదువుతున్న విద్యార్థుల కొరకు ఆంగ్ల మరియు తెలుగు మాథ్యమాలలో సులభంగా అర్థమయ్యేరీతిలో తయారుచేసిన పుస్తకాల కొరకు 9885678410 ను సంప్రదించండి. ✿

Wednesday 8 March 2017

MOTIVATIONAL SPEECH OF INTERNATIONAL WOMEN'S DAY

MOTIVATIONAL SPEECH OF INTERNATIONAL WOMEN'S DAY

INTERNATIONAL WOMEN'S DAY


అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 
చం.చదవన్నేర్తురు పూరుషుల్ బలెనె శాస్త్రంబుల్ పఠింపించుచో
     నదమన్నేర్తురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుచో
     నుదితోత్సాహము తోడ నేలగలరీ యుర్విన్ బ్రతిష్ఠించుచో
     ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్.

                                                                --చిలకమర్తివారి "ప్రసన్నయాదవం"నుండి

File:Animated rainbow rule revers.gif

యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
                                            -- ఆడవాళ్ళకు గౌరవం ఉన్నచోట దేవతలు విహరిస్తారు అని దీని అర్థం.
File:Animated rainbow rule revers.gif 

బ్రతుకు ముళ్ళ బాటలోన జతగా స్నేహితురాలవైతివి... 
       కన్నీళ్ళు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లెవైతివి... 
               వెనక ముందు అయినప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి... 
                      పురిటినొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి... 

File:Animated rainbow rule revers.gif

శతాబ్దాల కట్టుబాట్లను తెంచుకొని ప్రగతిపథం వైపు దూసుకుపోతున్న మహిళలు చైతన్య ప్రతీకలు. ఆకాశంలోనే కాదు అన్నింటా మేం సగం అంటూ తమ సాధికారత కోసం గళం విప్పతున్నారు. మహిళా చైతన్యానికి స్పూర్తిగా ప్రపంచమంతటా ప్రతియేటా 'మార్చి-8'స అంతర్జాతీయ మహిళాదినోత్సవం జరుపుకుంటారు.

ఒక్కసారి చరిత్రలోకి వెళితే ఇంగ్లాండులో పారిశ్రామిక విప్లవం ప్రారంభమై ప్రపంచమంతటికీ విస్తరించింది. పెరుగుతున్న ఫ్యాక్టరీలకు కార్మికులు తక్కువయ్యారు. తక్కువ వేతనానికి పనిచేసే స్త్రీలను కార్మికులుగా పెట్టకోవలసి వచ్చింది. పురుషులకన్నా ఎక్కువ పనిచేసి తక్కువ వేతనం తీసుకోవడాన్ని నిరసిసూ అనేక మంది మహిళలు సంఘటితమయి ఉద్యమాలు చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌లో వేలాది వస్త్ర పరిశ్రమల మహిళా కార్మికులు 1908 మార్చి-8న రడ్చర్ స్క్వేర్ వద్ద ప్రదర్శన జరిపారు. 8 గంటల పనిదినంతోపాటు సురక్షితమైన పని పరిస్థితులు, లింగ, జాతి, ఆస్తి, విద్యార్హతతో సంబంధం లేకుండా ఓటుహక్కు కావాలని డిమాండ్ చేశారు. దాంతో ఆ ఉద్యమం చారిత్రక ప్రాధాన్యాన్ని పొందింది.

సోషలిస్ట్ ఉద్యమకారిణి కారా జెట్మిన్ 1910 డెన్మార్క్లోని కోపెన్‌హగ్ లో జరిగిన "రెండవ అంతర్జాతీయ సోషలిస్టు మహిళల కాన్ఫరెన్స్‌" "మార్చి-8" ని అంతర్జాతీయ మహిళాదినంగా పాటించాలని తీర్మానించింది. నాటి నుండి అనేక దేశాలు దీనిని పాటిస్తున్నాయి. మనదేశంలో మొదటిసారిగా 1943 మార్చి8 న ముంబైలో బొంబాయి-సోవియట్ యూనియన్ మిత్రమండలి దీనిని నిర్వహించింది. 1970 దశకంలో ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమాలు, నిర్బంధాలు స్త్రీవాద ఉద్యమాలకు బీజం వేశాయి. 1975 ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది. సంచలనాత్మకమైన మదుర రేప్‌ కెసును తిరిగి విచారించాలని 1980 మార్చి 8 న దేశవ్యాప్తంగా మహిళలు ఉద్యమించారు. ఆ తరువాత మార్చి-8 మహిళా సంఘాలకు పండుగ దినంగా, ఉద్యమ అంకిత దినంగా మారింది.