MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

14 ఏళ్ల బాలుడి డ్రోన్ ఆవిష్కరణ

Harshwardhan Zala, a Class 10 student making drones for the Gujarat government

14 ఏళ్ల బాలుడి డ్రోన్  ఆవిష్కరణ
సాక్షి  పత్రిక సౌజన్యంతో
హర్షవర్ధన్ జాలా. వయసు 14 సంవత్సరాలు. చదివేది పదో తరగతి. ఏరోబాటిక్స్ 7 టెక్ సొల్యూషన్స్ అనే సంస్థకు వ్యవస్థాపకుడు, సీఈఓ. గుజరాత్ ప్రభుత్వంలోని శాస్త్ర సాంకేతిక శాఖ అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. యుద్ధ ప్రాంతాల్లోను, సరిహద్దుల్లోను మందుపాతరలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసేందుకు ఉపయోగపడే డ్రోన్లను అతడు రూపొందించాడు. ఇప్పటికే మూడు నమూనా డ్రోన్లు తయారు చేసేశాడు. టీవీ చూస్తున్నప్పుడు చాలామంది సైనికులు మందుపాతరలు పేలి మరణించడం లేదా తీవ్రంగా గాయపడటం లాంటి ఘటనలు చూసినప్పుడు తనకు ఈ ఆలోచన వచ్చిందని అతడు చెప్పాడు. ఈ మూడు నమూనా డ్రోన్లు తయారుచేయడానికి అతడికి 5 లక్షలు కూడా పూర్తిగా ఖర్చవలేదు. కానీ 5 కోట్ల కాంట్రాక్టు పట్టేశాడు.

           భూమికి 2 అడుగుల ఎత్తున ఎగురుతూ, 8 చదరపు మీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతం మొత్తాన్ని ఈ డ్రోన్ కవర్ చేస్తుంది. ఆ పరిధిలో ఎక్కడైనా మందుపాతరలను గుర్తిస్తే వెంటనే బేస్ స్టేషన్‌కు తెలియజేస్తుంది. ఇందులో 50 గ్రాముల బరువున్న బాంబు ఒకటి ఉంటుంది. అది మందుపాతరను ధ్వంసం చేస్తుంది. తన కంపెనీ ఏరోబాటిక్స్ పేరు మీద ఈ డ్రోన్‌కు ఇప్పటికే పేటెంట్ కూడా రిజిస్టర్ చేసేశాడు. 

                                                                  --- సాక్షి  పత్రిక సౌజన్యంతో - January 13, 2017.

పరికరం పనిచేసే విధానాన్ని ఈ  వీడియోలో వీక్షించండి.

No comments:

Post a Comment