MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

BAT BOT ROBOT

BAT BOT ROBOT :
గబ్బిలానికి ప్రతిరూపం ఈ బుల్లి రోబో
గబ్బిలాల మాదిరిగానే రెక్కలను విప్పుకొని పైకి, కిందకు అల్లాడిస్తూ పనిచేసే రోబోను ఆవిష్కరించారు. ఇలా రెక్కలు కొట్టుకోగల రోబోను తయారుచేయడం ఇదే మొదటిసారి కాగా, దీనివల్ల అనేకానేక ప్రయోజనాలు ఉంటాయని దీన్ని తయారు చేసిన కాల్‌టెక్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంటున్నారు. గాల్లో ఉండేందుకు డ్రోన్‌ల మాదిరిగా ఇంజిన్లు నిత్యం ఆన్‌లో ఉంచుకోవాల్సిన అవసరం లేకపోవడం వీటిల్లో ఒకటి మాత్రమే.

అతితక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లడం రెక్కల రోబోతోనే సాధ్యం.  కేవలం 93 గ్రాముల బరువు ఉండే ఈ రోబోను చిన్న చిన్న ప్రదేశాల్లోనూ సులువుగా తిప్పవచ్చు.  దీని రెక్కలు దాదాపు ఒక అడుగు విస్తీర్ణంలో విచ్చుకుంటాయి. గబ్బిలాల మాదిరిగానే తన రెక్కల మధ్యలో ఉండే అనేక కీళ్లను కదిలిస్తూ ముందుకు కదులుతుంది ఇది. గాలి ఒత్తిడిని తట్టుకునేందుకు వీలుగా ఈ రెక్కలకు 56 మైక్రాన్ల మందమున్న ప్రత్యేకమైన సిలికాన్‌ పదార్థంతో తయారు చేశారు. దీనికి సరికొత్త మార్పులు చేర్పులు చేస్తే నిఘా వ్యవస్థకి ఎంతో ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.
                                                                                              --- ఆంధ్రజ్యోతి పత్రిక సౌజన్యంతో.









పరికరం పనిచేసే విధానాన్ని ఈ  వీడియోలో వీక్షించండి. 

No comments:

Post a Comment