MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

BIO PLASTIC

BIO PLASTIC
బయో ప్లాస్టిక్  
తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి హాని కలిగించని విధంగా భూమిలో కలిసే బయోడిగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ తయారుచేయడానికి కొత్త టెక్నాలజీని కనిపెట్టినట్లు యూకేకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. బయోడిగ్రేడబుల్‌ కప్పులు, ప్లాస్టిక్‌ రూపొందించేందుకు బయోప్లాస్టిక్‌ను రూపొందిస్తున్నారు. బెల్జియంలోని కేయూ లెయూవెన్‌ పరిశోధన కేంద్రంలో కొత్త పద్ధతి ద్వారా తక్కువ ఖర్చుతో, వృథా కాని బయోప్లాస్టిక్‌ను తయారుచేస్తున్నారు. దీనిని వ్యర్థాల నుంచి తయారుచేయడమే కాకుండా తిరిగి పునరుత్పాదక వస్తువుగా తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్లాస్టిక్‌ను ఇలా తాగొచ్చు
బాలి: ఇండోనేషియా ద్వీపకల్పానికి మణిహారం బాలి దీవి. సుందరమైన బీచ్‌లతో కళకళలాడుతూ ఉండే ఇక్కడి బీచ్‌లు ప్యాస్టిక్‌ బాటిళ్లు, బ్యాగులతో కంపుకొడుతున్నాయి. ప్రపంచంలోనే చైనా తర్వాత, ఇండోనేషియానే ఎక్కువ ప్లాస్టిక్‌ను తీసుకొచ్చి నేరుగా సముద్రంలో పారేస్తోంది. అది ఎక్కువగా బాలి బీచ్‌లకే కొట్టుకొస్తోంది. ప్లాస్టిక్‌ గాలిలో కలిసిపోదు, మట్టిలో కుళ్లిపోదు. వాటిని తిన్న జంతువులు, జలచరాలు మత్యువాతన పడుతున్నాయి.

ప్రపంచంలో ముందుగా కోలుకున్న పలు దేశాలు ప్లాస్టిక్‌ ఉపయోగాన్ని ఇప్పటికే  నిషేధించాయి. ‘బై బై ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఇద్దరు అమ్మాయిల విస్తృత ప్రచారం కారణంగా ఇండోనేషియా ప్రభుత్వం 2018 నుంచి ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. నిషేధంకన్నా ప్రత్యామ్నాయమార్గం ముఖ్యమని భావించిన బాలికి చెందిన కెవిన్‌ కుమాల్‌ అనే యువకుడు ఆ దిశగా ప్రయోగాలు ప్రారంభించారు. స్వతహాగా బయోకెమిస్ట్రీ చదివిన కుమాల్‌ ఇండేనేసియాలో దొరికే కసావా లాంటి కూరగాయ దుంపలతో, కూరగాయల నూనె, సేంద్రీయ పదార్థాలను కలిపి బయో ప్లాస్టిక్‌ను తయారు చేశారు. దాన్ని ద్రావకంగా తాగడం ద్వారా అందులో ఎలాంటి విషపదార్థాలు లేవని నిరూపించారు. ఆ ద్రావకంతో బ్యాగులను తయారు చేసి అవి మట్టిలో కలసిపోగలవని ధ్రువీకరించారు.
...........January 17, 2017 courtesy of sakshi daily.

No comments:

Post a Comment