MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

CATERPILLAR ROBOT

CATERPILLAR ROBO :


కేటర్ పిల్లర్ రోబో:

ఈ రోబో చెట్లను ఎక్కి పర్యావరణాన్ని పరిశీలించి నూతన అధ్యయనానికి తోడ్పడుతుంది. సాధారణంగా రోబోలను ధృఢమైన భాగాలతో తయారుచేస్తారు. కానీ ఈ రోబో స్థితిస్థాపక లక్షణము గల రబ్బరుతో తయారు చేసారు. ఈ మృదువైన రోబోల డిజైన్లు తయారీకి సాధారణంగా ఆక్టోపస్, స్టార్‌ఫిష్, పురుగురు మరియు యితర ఎముకలు లేని జీవరాశుల ఆకారాలు శాస్త్రవేత్తల ఆవిష్కరణను ప్రేరేపించాయి. ఈ రోబోలు మన పరిసరాలకు అనుకూలంగా పనిచేస్తాయి. ఈ రోబోలతో మనం కలసి ఉన్నప్పుడు వాటి మృదు భాగాల వల్ల మనకు రక్షణ ఉంటుంది. కాటర్ పిల్లర్ లకు తన శరీర కదలికలపై మెదడు ప్రభావం ఉండదు. కారణం దాని శరీరంలో అనేక చిన్న న్యూరాన్లు కలిగి ఉంటాయి. అవి తమ శరీరాన్ని వికేంద్రీకృత పద్ధతిలో నియంత్రిస్తాయి. అందువల్ల శాస్త్రవేత్తలు దాని ఆకారాలకు, శరీర నిర్మాణానికి ప్రభావితులై ఈ రోబోను ఆవిష్కరించారు. ఈ రోబోలకు సెన్సార్లను అమర్చారు. ఇది తలంపై నడిచినపుడు తలంపై గల ఘర్షణ మూలంగా కదలుతుంది. దానిని నియంత్రించే విధానాన్ని కంప్యూటర్ తో అనుసంధానిస్తారు.  

ఈ రోబో చెట్లపై గల కొమ్మలపైకి ప్రాకుతూ అది ప్రయాణించే పరిసరాలలో ఉష్ణోగ్రత మరియు తేమను సెన్సార్ల ద్వారా సమాచారాన్ని సేకరిస్తుంది.


No comments:

Post a Comment