MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

FLYING CAR

ఎగిరే కారు... 
గంటల తరబడి ట్రాఫిక్‌లో పడిగాపులు గాచేటప్పుడు... 
ఉన్నపాటున ఎగిరిపోయే అవకాశం వస్తే ఎలా ఉంటుంది...? 
మీ కారును అమాంతం ఆకాశానికి తీసుకెళ్లి ట్రాఫిక్ మీదుగా వెళ్లిపోతే... 
ఆ ఫీలింగే అద్భుతం కదా... 
సరిగ్గా అలాంటి ఫ్లయింగ్ కార్లు ఇప్పుడు నిజరూపాన్ని సంతరించుకున్నాయి. జర్మనీకి చెందిన స్టార్టప్ కంపెనీ లిలియం ఏవియేషన్ ఈ తరహా సరికొత్త వాహనాన్ని రూపొందించింది. నిటారుగా టేకాఫ్, ల్యాండింగ్ తీసుకోగల ఎలక్ట్రిక్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. వ్యక్తిగత అవసరాల కోసం ఇలాంటి వాహనాన్ని అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి.

ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కావాలంటే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. హెలికాప్టర్ తరహాలోనే ఉండడంతో పొడవాటి రన్‌వే అవసరం లేదు. ఈ ఫ్లయింగ్ కారు జెట్ అంతటిది కాకపోయినా... ఒక పవర్‌ఫుల్ జెట్ వేగాన్ని ఇట్టే అందుకోగలదు. రెండు చిన్నపాటి సీట్లు ఉండే ఈ ఫ్లయింగ్ కారు.. గంటకు 300 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకోగలదని లిలియమ్ వెల్లడించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... 10 మీటర్ల పొడవైన రెక్కలు అమర్చి ఉండే ఈ ఫ్లయింగ్ కారుకు 36 ప్రత్యేక ఇంజిన్లతో పనిచేస్తుందట!
                                                                                                     --- ఆంధ్రజ్యోతి పత్రిక సౌజన్యంతో.









Flying Car: Lilium Jet take its first test flight in Germany

 ఈ  కారు నడిచే  విధానాన్ని ఈ  వీడియోలో వీక్షించండి. 

No comments:

Post a Comment