MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

HYDROGEL ROBOT

చేపలు పట్టే హైడ్రోజెల్‌ రోబోలు



వాషింగ్టన్‌: శాస్త్రవేత్తలు సరికొత్త రీతిలో పారదర్శక, జెల్‌ ఆధారిత రోబోల్ని రూపొందించారు. ఈ రోబోలకు రకరకాల రీతుల్లో వేగంగా, శక్తిమంతమైన పనులు చేసే సామర్థ్యం ఉంది. నీటి లోపల ఓ బంతిని తన్నటం, సజీవ చేపల్ని పట్టుకోవడం, వదిలిపెట్టడం వంటి పనులు చేయగలవు. కఠినమైన, రబ్బరుతో కూడిన, పారదర్శక హైడ్రోజెల్‌ పదార్థంతో వీటిని తయారు చేశారు. హైడ్రోజల్‌ నిర్మాణాల్లోకి నీటిని నింపగానే ఇవి వ్యాకోచించి పూర్తిరూపాన్ని సంతరించుకుంటాయి. రకరకాల ఆకృతుల్లో తీర్చిదిద్దిన ఈ జెల్‌ రోబోలు జీవవైద్య రంగంలో ఉపయోగించేందుకు పూర్తిగా సురక్షితమని శాస్త్రవేత్తలు యుక్‌, ఝావో పేర్కొన్నారు. వీటిని ఎన్నిసార్లు ఉపయోగించినా దెబ్బతినలేదని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.
                                                                        ---ఈనాడు దిన పత్రిక తే. 03.02.2017. 

హైడ్రోజెల్ రోబో  పనిచేసే విధానాన్ని ఈ  వీడియోలో వీక్షించండి. 

No comments:

Post a Comment