MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

HYPER LOOP CAPSULE TRAIN

హైపర్ లూప్ క్యాప్సూల్:

హైపర్ లూప్ ప్రాజెక్టు విధానంలో గంటకు 760 కి.మీ వేగంతో నిర్ధిష్ట ట్రాక్‌లలో క్యాప్సూల్స్ వంటి చిన్న రైలు పెట్టెలు ప్రయాణించి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే  రైలు వ్యవస్థ. ఈ విధానంలో గాలితీసేసిన ట్యూబ్‌ని నిర్దేశించిన గమ్యాల మధ్య ఏర్పాటుచేస్తారు. రోడ్డు మధ్యలో మెట్రో రైలుకోసం నిర్మించినట్టుగాగానే, ఫ్లైఓవర్‌ లేక వంతెనలాంటిది నిర్మించి, దానిపై ట్యూబ్‌ను అమరుస్తారు. ఆ ట్యూబ్‌లోంచి గంటకు 750 కిలోమీటర్ల వేగంతో క్యాప్సూల్స్‌ దూసుకెళతాయి. అదేసమయంలో ఏంత వేగంతో పోతున్నా, ఆరంటే ఆరు సెకన్లలోనే నిలిపివేయొచ్చు. క్యాప్సూల్‌ అంటే 28 నుంచి 50 మంది పట్టే చిన్న రైలు పెట్టెలాంటిది. క్యాప్సూల్‌ ఆకారంలో ఇది ఉంటుంది. విండ్‌, సోలార్‌, కెనటిక్‌ ఎనర్జీలను ఉపయోగించి క్యాప్సూల్స్‌ని ధ్వనివేగంతో నడిపిస్తారు. ప్రతి 40 సెకన్లకు ఒక క్యాప్యూల్‌ను ట్యూబ్‌లోకి పంపించవచ్చు. ఇలా ఏడాదికి 2.4 కోట్లమందిని చేరవేరవచ్చు. సరుకు రవాణాకూ ఈమార్గాన్ని ఉపయోగించవచ్చు. మరోవిశే షం ఏమిటంటే.. క్యాప్సూల్స్‌కు వర్చ్యువల్‌ విం డోస్‌ ఉంటాయి. అంటే క్యాప్సూల్‌ కిటికీలోంచి మనం బయటకు చూసేటప్పుడు..ఆ దృశ్యాన్ని మనకు కావాల్సినట్టుగా చూడొచ్చునన్నమాట. అంతేకాదు, పూర్తి సురక్షితమైన ప్రయాణాన్ని హైపర్‌లూప్‌ హామీ పడుతుంది.
భూమి ఆదా.. ఖర్చు తక్కువ:
మెట్రో రైలు మార్గం నిర్మాణానికి కిలోమీటరుకు 80 మిలియన్‌ డాలర్లు, హైస్పీడ్‌ రైలుకు 50 నుంచి 150మిలియన్‌ డాలర్లు ఖర్చు అయితే.. హైపర్‌ లూప్‌ ట్యూట్‌ నిర్మాణానికి కిలోమీటరుకు 40 మిలియన్‌ డాలర్లు చాలు. ఎంత సమయం పడుతుందనేది స్థానిక పరిస్థితులు, నిధులకు అనుగుణంగా ఉంటుంది. సాధారణంగా ఐదునుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం మార్గాన్ని 38 నెలల్లో పూర్తిచేయవచ్చు. ప్రస్తుతం ఇంటర్‌ సిటీ, సిటీల మధ్య హైపర్‌లూప్‌ మార్గాలు వేస్తున్నారు. భవిష్యత్తులో ఖండాల మధ్య కూడా ఈ రవాణా మార్గాలు చూడొచ్చు. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుంటూ కూడా, వీటి నిర్మాణాన్ని చేపట్టవచ్చు. వీటి నిర్మాణానికి పెద్దగా భూమి అవసరం ఉండదు. ఇలాంటి ప్రాజెక్టులు రావడం వల్ల భూముల విలువలు కూడా పెరుగుతాయి. కాలిఫోర్నియాలో ఇదే జరిగింది.
                                                                                           --- ఆంధ్రజ్యోతి పత్రిక సౌజన్యంతో.
విధానం:
గంటకు అక్షరాలా 1126.54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్ధ్యాన్ని ఈ వాహనం కలిగి ఉంటుంది. ఈ వాహనం కోసం గంటకు ఏడొందల క్యాప్సూల్స్ ను రూపొందిస్తారు. ఆ క్యాప్సూల్ ఒక్కొక్కటి 28 సీట్ల సామర్ద్యం కలిగి ఉంటుంది. ఈ క్యాప్సుల్స్ అత్యంత శక్తివంతమైన ఫ్యాన్ ను అమర్చడం ద్వారా.. ట్యూబ్ ఈ చివరి దాకా గాలినిరోధాన్ని పూర్తిస్థాయిలో తగ్గిస్తారు. తద్వారా క్యాప్సూల్స్ ఆ వేగాన్ని కొనసాగిస్తాయి. అదే సమయంలో, అవి ప్రమాదానికి గురికాకుండా అడుగుభాగంలో అయిస్కాంత శక్తిని ఉపయోగిస్తారు. అంటే.. ప్రతి క్యాప్సూల్ గాలిలో కొంచెం కూడా కుదుపు లేుకుండా ప్రయాణిస్తుందన్నమాట.  

హైస్పీడ్ రైలు కన్నా మించిన వేగంతో ప్రయాణీంచే హైపర్ లూప్ క్యాప్సూల్ అమెరికాలోని లాస్ ఏంజెలిస్ - శాన్ ఫ్రాన్సిస్కోల మధ్యదూరాన్ని కేవలం 30 నిమిషాల్లో అధిగమించగలదు.



హైపర్ లూప్ క్యాప్సూల్ పనిచేసే విధానాన్ని ఈ  వీడియోలో వీక్షించండి. 

No comments:

Post a Comment