MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

Hyundai Ioniq Scooter

HYUNDAI LONIQ SCOOTER:
హుండాయ్ లోనిక్ స్కూటర్
కాళ్లరిగేలా తిరిగేవారికి.. బలపం లాంటి బైక్‌
           కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్‌ తాజాగా ఈ స్కూటర్‌ను తయారు చేసింది. అవసరమైనప్పుడు ఇది మిమ్మల్ని చిన్న చిన్న దూరాలు దాటిస్తుంది. పెద్దగా బరువు కూడా ఉండదు. ఎంచక్కా ఫోల్డ్‌ చేసుకుని చంకన పెట్టేసుకోవచ్చు కూడా. అలాగే అవసరమైనప్పుడు సెకన్లలో విడదీసుకుని వెళ్లిపోవచ్చు. హ్యాండిల్‌పై ఉండే డిజిటల్‌ డ్యాష్‌బోర్డు ద్వారా వేగం ఎంత, బ్యాటరీ సామర్థ్యం ఎంత మిగిలి ఉంది అనే వివరాలన్నీ తెలుసుకోవచ్చు. హ్యాండిల్‌ బార్‌పై బొటనవేలు ఉండే చోట బటన్‌తో వేగం పెంచుకోవచ్చు. ఇంకోవైపున ఉండే హ్యాండిల్‌ బార్‌పై బ్రేక్‌ ఉంటుంది. కాళ్లు ఆనే చోట ఉన్న చిన్న ప్యాడ్‌ ద్వారా కూడా బ్రేక్‌లు వేయవచ్చు. అంతేకాకుండా దీన్ని నడిపేటప్పుడు మనం కాళ్లు పూర్తిగా స్కూటర్‌పై పెట్టకపోయినా.. బ్యాలెన్స్‌ లేకపోయినా స్కూటర్‌ అస్సలు ముందుకు కదలదు. భద్రంగా ఉన్నామని అనుకున్నప్పుడే రైడింగ్‌ పద్ధతిలో ఆన్‌ అయ్యేలా సెన్సర్లు ఏర్పాటు చేశారు.             .....సాక్షి  సౌజన్యంతో :  తేదీ: 21. 1. 2017
                                                                                          





పరికరం పనిచేసే విధానాన్ని ఈ  వీడియోలో వీక్షించండి. 

No comments:

Post a Comment