MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

LOW COST CENTRIFUGE

LOW COST PAPER CENTRIFUGE:


రక్తపరీక్షలో కీలకమైన పరికరం తయారీ
బోస్టన్‌, జనవరి 11: మలేరియా, హెచ్‌ఐవీ, క్షయ వ్యాధుల నిర్ధారణకు వైద్యులు రక్త పరీక్షలపై ఆధారపడతారు. ఈ పరీక్షలలో సెంట్రీఫ్యూజ్‌ అనే పరికరం అత్యంత కీలకమైనది. రోగి నుంచి సేకరించిన రక్తాన్ని పొరలుపొరలుగా విడగొట్టేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ పరికరం ఖరీదు వేలల్లో ఉంటుంది. దీనికి పట్టే సమయమూ ఎక్కువే! ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చు(రూ.14)తో, కేవలం ఒకటిన్నర నిమిషం(తొంభై సెకన్ల)లో ఈ పక్రియను పూర్తిచేసే సరికొత్త సెంట్రీఫ్యూజ్‌ను అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. చిన్నపిల్లల ఆటవస్తువు స్ఫూర్తిగా ఈ సెంట్రీఫ్యూజ్‌ను తయారుచేశారు. స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీకి చెందిన ఈ పరిశోధక బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త మనుప్రకాష్‌ కూడా ఉండడం విశేషం. విద్యుతశ్చక్తి, మరే ఇతర మెషీన్‌ సాయంలేకుండా చేతులతో అత్యంత వేగంగా తిప్పే వస్తువు తనకు తెలిసి ఇదొక్కటేనని మనుప్రకాష్‌ తెలిపారు. ఖరీదైన సెంట్రీఫ్యూజ్‌ కారణంగా రక్తపరీక్షల ఫీజులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. తాజా పరికరం అందుబాటులోకి వస్తే రక్త పరీక్షల ఫీజులు తగ్గే అవకాశం ఉంది.
                                                                                              --- ఆంధ్రజ్యోతి పత్రిక సౌజన్యంతో.
విధానం:
రెండు వృత్తాకార అట్టముక్కలను తీసుకోవాలి. వాటి  మధ్యలో కేంద్రానికి ఇరువైపులా రెండు రంధ్రాలు చేయాలి. వ్యాధిగ్రస్తుని రక్త నమూనాలను చిన్న నాళికలలో తీసుకోవాలి. వాటిని వృత్తాకార అట్టముక్కల మధ్య పటంలో చూపిన విధంగా అమర్చాలి. అట్టముక్కలను అతికించాలి. రంధ్రాలగుండా దారాన్ని అమర్చి దారం చివరలను కలపాలి. ఇపుడు చిన్నపిల్లలు ఆడే ఆట వస్తువు మాదిరిగా వేగంగా త్రిప్పాలి. అప్పుడు ఆ పరీక్షనాళికలోని వివిధ భారాలు గల కణాలు వేరుపడతాయి. ఇది అపకేంద్రయంత్రంలా పనిచేస్తుంది. 





పరికరం పనిచేసే విధానాన్ని ఈ  వీడియోలో వీక్షించండి. 

No comments:

Post a Comment