MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

PLASTIC EATING CATTERPILLAR

ప్లాస్టిక్ ను తినే గొంగళిపురుగు 
నేడు ప్రపంచమంతా ప్లాస్టిక్ మయంగా మారింది. 
ప్రతి ఏటా లక్ష కోట్లకు పైగా ప్లాస్టిక్‌ బ్యాగులను మనం ఉపయోగిస్తున్నాం. 
వేల టన్నుల ప్లాస్టిక్‌ భూమిలో కలవాలంటే వందల ఏళ్లు పడుతుంది. 
ఈ ప్లాస్టిక్‌వల్ల సముద్ర జలాలు, పర్యావరణం కలుషితమవుతున్నాయి. 
ఈ సమస్యకు పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా క‌‌ృషిచేస్తున్నారు. 
అయినా పరిష్కారం లభించక ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. 

అయితే, స్పెయిన్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ బయోమెడిసిన్‌ అండ్‌ బయోటెక్నాలజీ ఆఫ్‌ కాంటబ్రియాకు చెందిన పరిశోధకులు అనుకోకుండా ప్లాస్టిక్‌ సమస్యకు పరిష్కారం కొనుగొన్నారు. వ్యాక్స్‌ వామ్స్‌ (wax worms) అనే ఓ రకమయిన గొంగళిపురుగులు ప్లాస్టిక్‌ బ్యాగులను, బాటిళ్లను తినడాన్ని వారు గమనించారు. ఈ పురుగులు ప్లాస్టిక్‌ బ్యాగులను తినడమే కాకుండా, తిన్న ప్లాస్టిక్‌ను పారదర్శకమయిన ఆల్కహాల్‌గా విసర్జిస్తున్నాయి. "గల్లేరియా మెల్లోనెల్లా  అనే సాధారణ క్రిమి లార్వా ప్లాస్టిక్‌ పాలిథీన్‌ను బయోడీగ్రేడ్‌ చేయగలుగుతోంది. పాలీథీన్‌ను తిని దానిని మారదర్శకమయిన ఆల్కహాల్‌ ఇథెలీన్‌ గ్లైకోల్‌ గా మార్చేస్తుంది. దీంతో, పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్‌ సమస్య పరిష్కారానికి మార్గం దొరికిందని భావిస్తున్నాం" అని పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్‌ బెర్టోచ్చిని చెప్పారు. వ్యాక్స్‌ వామ్స్‌ ఎక్కువగా యూరోప్‌, ఉత్తర అమెరికాలోని తూర్పు ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి తేనెతట్టులో గుడ్లు పెడతాయి. వాటి లార్వాలు సాధారణంగా తేనె మైనం తింటూ పెరుగుతాయి.                                                                                     
                                                                                --- ఆంధ్రజ్యోతి పత్రిక సౌజన్యంతో.









Plastic waste: Wax worms can eat through plastic, researchers find



 వాక్స్ వామ్స్ ప్లాస్టిక్ తినే  విధానాన్ని ఈ  వీడియోలో వీక్షించండి. 

No comments:

Post a Comment