MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

PLASTIC ROADS

PLASTIC ROADS:

జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రయోగాత్మకంగాప్లాస్టిక్‌ రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. బీఎన్‌రెడ్డినగర్‌, మన్సూరాబాద్‌ డివిజన్లలో 34లక్షల వ్యయంతో రోడ్లను నిర్మించనున్నారు.ఫేజ్‌1లో 500మీటర్లు పొడవున ప్లాస్టిక్‌రోడ్డు నిర్మాణ పనులను శనివారం ప్రారంభించారు. ఒకలోడ్‌ బీటీ రా మెటీరియల్‌లో 89కేజీల ప్లాస్టిక్‌ ముక్కలను 168డి గ్రీల వేడిలో మరిగించి రోడ్డునిర్మాణానికి ఉపయోగిస్తారు. మొత్తం రా మెటీరియల్‌లో 8శాతం  ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తారు. తడిపొడి చెత్త వేరు చేసేటప్పుడు వచ్చే ప్లాస్టిక్‌ వ్యర్థాలను రోడ్లనిర్మాణానికి వినియోగించనున్నారు.
                                                                                                 --- ఆంధ్రజ్యోతి పత్రిక సౌజన్యంతో.


ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు



            ఈ విధానంలో నిర్మించే రహదారులు సంప్రదాయ బిటి రోడ్ల కంటే నాలుగు రెట్లు ధృడంగా ఉంటాయి. తక్కువ ఖర్చుతో నిర్మించే అవకాశం ఉంటుంది. ప్రజలు వాడి వృథాగా పారేసే క్యారీ బ్యాగ్‌లు, డిస్పోజబుల్ గ్లాసులు, ప్లాస్టిక్ వస్తువులను ఇందుకు వినియోగిస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి, ప్రత్యేక పద్ధతిలో రహదారుల నిర్మాణానికి వినియోగించే మెటీరియల్స్‌లో కలపడం వలన 10 శాతం బిటుమెన్ ఆదా అవుతుంది. ఆ మేరకు నిర్మాణ ఖర్చు తగ్గడంతో పాటు చెత్త సేకరించే వారికి ఆదాయం కూడా లభిస్తుంది. ఇది పర్యావరణ హితమైన ప్రాజెక్టు కావడంతో నగరాల్లో లభించే చెత్తను నిర్మూలించడానికి దోహదపడుతుంది.                                        

                            ---      Wednesday, 11 January 2017 in Andhra Jyothi e paper




ప్లాస్టిక్ రోడ్లు వేసే విధానం మరియు దాని ఉపయోగాలను తెలియజేసే వీడియోను సందర్శించండి. 

1 comment: