MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

World’s First Commercial CO2 Capture Plant

World's First Commercial CO2 capture Plant

ప్రపంచం లో మొదటి కార్బన్ డై ఆక్సయిడ్ శోషించే ప్లాంటు 

వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ ను తగ్గించాలంటే చెట్లను పెంచాలి. కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం పెరిగితే గ్లోబల్ వార్మింగ్ కు దారితీస్తుంది. దీనిని నివారించడానికి స్విడ్జర్లాండ్ లోని ఒక కంపెనీ కృత్రిమంగా వాతావరణంలో ఉన్న కార్బన్‌డైఆక్సైడ్ ను సేకరించి తోటకూర మొక్కలకు పంపిణీ చేస్తున్నది. దీని వలన ఆ మొక్కలు 30 శాతం అదనంగా పెరుగుతున్నాయి. వాతావరణంలోనూ కార్బన్ డై ఆక్సైడ్ తగ్గుతోంది. ఇలా వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ ను వేరుచేసి సేకరించడం తొలిసారి. ఈ కంపెనీ ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తే 2025 నాటికి 1 శాతం కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గించవచ్చని పరిశోధకులు అంటున్నారు.

ఈ ప్లాంటు ఒక సంవత్సరానికి 900 టన్నుల వరకు వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ ను శోషిస్తుంది. ఈ ప్లాంట్ లో పలు CO2 కలెక్టర్లు ఉంటాయి. పెద్ద పెద్ద పెట్టెల్లో ఫిల్టర్లతో వీటిని ఏర్పాటు చేసారు. ఈ పెట్టెల ద్వారా కొన్ని గంటల పాటు గాలి వెళుతుంది. ఇదే సమయంలో ఈ పెట్టెలను 100 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసి శుభ్రమైన కార్బన్ డై ఆక్సైడ్ ను వేరుచేస్తారు.


ఈ ప్లాంటు జూరిక్ లోని స్విస్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మాథమెటిక్స్ విశ్వవిద్యాలయం, హిన్విల్ అనే ఊరిలో క్లైం వర్క్స్ పేరిట కార్బన్ డై ఆక్సైడ్ ను వేరుచేసే ప్లాంటును ఏర్పాటు చేసింది. జెబ్రూదర్ మియర్ ప్రిమానేచురా అనే సంస్థ ఈ కార్బన్ డయాక్సైడ్ ను తోటకూరల పెంపకానికి వినియోగిస్తుంది.
                                                                                    
                                                                                --- ఆంధ్రజ్యోతి పత్రిక సౌజన్యంతో.






Climeworks makes history with world-first commercial CO2 capture plant

No comments:

Post a Comment